
మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఫామ్ లోకి వస్తున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ త్వరలోనే పెళ్లికూతురు కానున్నది. లీగల్, హనుమాన్, కోటబొమ్మాలి సినిమాల్లో నటనతో వరలక్ష్మీ ప్రత్యేకతను తెచ్చుకుంది. దీంతో అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్తో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ముంబైలో జరిగిన ఈ నిశ్చితార్థానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మార్చి 1వ తేదీన జరిగిన ఈ వేడుకల ఫొటోలు ఈరోజు బయటకొచ్చాయి. ఈ ఫొటోలతో పాటు వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలియజేసే ఒక లెటర్ కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది.
నికోలయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన వ్యాపార వేత్త. ఆర్ట్ గ్యాలరీలు కూడా నిర్వహిస్తుంటాడు. ఆన్లైన్లో వివిధ రకాల పెయింటింగ్‌లు, ఆర్ట్స్ అమ్ముతుంటాడు. నికోలయ్‌తో వరలక్ష్మీకి 14 ఏండ్లుగా పరిచయం ఉంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు తమ రిలేషన్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.