‘కింగ్డమ్’ చిత్రంలో మురుగన్ పాత్రతో గుర్తింపును తెచ్చుకున్న వెంకటేష్ వి.పి. హీరోగా పరిచయం అవుతున్నాడు. సురేష్ తేజ్ దర్శకత్వంలో రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. ‘కె ర్యాంప్’ తర్వాత ఈ బ్యానర్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘డి.జి.పి’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ, డైరెక్టర్ సురేష్ తేజ్ తిరువనంతపురంలో తన రెస్టారెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్న హీరో వెంకటేష్‌తో ఫోన్లో మాట్లాడి తమ సినిమాలో హీరోగా తీసుకుంటున్నట్లు రివీల్ చేయడం ఆసక్తికరంగా ఉంది.
