
ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29) కన్నుమూశారు. తండ్రి మరణంతో వేణు ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. ఇక ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.