శ్రియారెడ్డి : సలార్ కోసం ఊహకందని విజువల్స్.. అదొక అద్భుతం

శ్రియారెడ్డి : సలార్ కోసం ఊహకందని విజువల్స్.. అదొక అద్భుతం

పొగరు మూవీ ఫెమ్ శ్రియారెడ్డి(Sriya reddy) సలార్ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఆ సినిమాలో ప్రభాస్(Prabhas) పాత్ర గురించి, ప్రశాంత్ నీల్(Prashanth neel) టేకింగ్ గురించి చెప్తూ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు సలార్(Salaar) సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. 

ఆ ప్రశ్నకు సమాదానంగా శ్రియారెడ్డి.. " మనకు ఇప్పటివరకు కేజీఎఫ్ మాత్రమే తెల్సు కానీ.. సలార్ సినిమా అంతకుమించి ఉంటుంది. సలార్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక ఆరా క్రియేట్ చేశాడు. అదొక కొత్త ప్రపంచం. గేమ్ అఫ్ థ్రోన్స్ రేంజ్ లో ఉంటుంది. ఆ ప్రపంచంలో ప్రభాస్ కింగ్. సినిమాలో ప్రతి సీన్, ప్రతి షాట్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి. ప్రస్తుతం సలార్ సినిమాపై శ్రియారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. వన్స్ సలార్ దిగాక.. ప్రీవియస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మరి.