శివరాత్రి వేడుకలో కాజల్, తమన్నా డ్యాన్స్

శివరాత్రి వేడుకలో కాజల్, తమన్నా డ్యాన్స్

శివరాత్రి వేడకలో సందడి చేశారు ఫిలింస్టార్స్ కాజల్, తమన్నా, రానా. నిషా అగర్వాల్. ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్‌ శివరాత్రి పర్వదినం సందర్భంగా కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్‌ మహాశివరాత్రి విశిష్టత గురించి ప్రసంగించారు. తర్వాత శివరాత్రి జాగరణలో భాగంగా రాత్రంతా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ వేడుకల్లో కాజల్‌, ఆమె సోదరి నిషా అగర్వాల్‌‌, తమన్నా, వాసుదేవ్‌ కలిసి డ్యాన్స్‌ చేశారు. వారంతా డ్యాన్స్ చేస్తున్న‌ వీడియోను కాజల్‌ అభిమానులు ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో… ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ప్రముఖ గాయకుడు కార్తిక్‌ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా హాజరయ్యారు.