
కొందరికి సోషల్ మీడియా వేదికగా కాంట్రావర్సీ పోస్టులు పెట్టడం బాగా కలిసొస్తుంటుంది. దీనిపై విమర్శలు, పొగడ్తలు, కామెంట్లు సర్వసాధారణం. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అనగానే గుర్తొచ్చే పేరు దర్శకుడు ఆర్జీవీ. ఇప్పుడు ఆయనతో నటి అనసూయ(Anasuya) కూడా చేరిందా..? అని అనిపిస్తుందంటున్నారు నెటిజన్లు.
ఆ రేంజ్లో సోషల్ మీడియాలో ఆమె పేరు కాంట్రవర్సీలతో మార్మోగిపోతోంది. వెండితెర, బుల్లితెరలపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయకు కేరాఫ్ అడ్రస్ కాంట్రావర్సీ అనే కామెంట్లు బలంగానే వినిపిస్తున్నాయి. కాదు కాదు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియా చర్చల్లో ఉంటోంది.
కావాలనే ఏదో ఒకటి వివాదం క్రియేట్ చేసేందుకు.. నెటిజన్ల దృష్టిలో పడేలా పోస్ట్లు పెట్టి.. ఆ తర్వాత వారి చేత ఏదో ఒకటి అనిపించుకుని.. మళ్లీ రియాక్ట్ అవ్వడం ఆమెకు సర్వసాధరణమైపోయింది" అని చాలా మంది నెటిజెన్స్ అభిప్రాయపడుతుంటారు.
హీరో విజయ్ దేవరకొండతో వివాదం..ఇలా ఎన్నో విషయాలతో వివాదాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇటీవల ఆనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య వేషధారణతో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
I feel fortunate to have been given this opportunity to give a tribute to these legendary actresses through my performance.. ???#Savithramma #JamunaGaru #SrideviGaru #SoundaryaGaru
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2023
Don’t miss #ZeeKutumbamAwards2023 this evening #6pmOnwards only on @zeetelugu ❤️ pic.twitter.com/S1HDmgUkrD
అయితే సావిత్రి వేషధారణపై కొంతమంది నెటిజన్లు విమర్శలు చేయగా.. "ఎక్స్‌పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే. అలానే ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా తేలిక కాదు. శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి" అని చెప్పుకొచ్చింది.
Correct ga chepparandi.. saavithramma la act cheyatam evari taram kadu.. nenu tribute ichanante ?? alage exposing cheyatam kuda easy kadu.. physically and emotionally chala prepare avvali..to be confident in whatever one is trying to potray.. in whatever one is wearing ? https://t.co/JnciM744Te
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2023
ఆర్జీవి కూడా ఇలానే వివాదాల్ని సృష్టించి పబ్లిసిటీ చేసుకుంటాడు. నువ్వు కూడా ఆయన్నే ఫాలో అవుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.