Vijay - Ivana: విజయ్ సినిమాకు నో చెప్పిన..లవ్ టుడే బ్యూటీ!

Vijay - Ivana: విజయ్ సినిమాకు నో చెప్పిన..లవ్ టుడే బ్యూటీ!

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్‌‌ (Thalapathy Vijay)కి టాలీవుడ్‌‌ లోనూ మంచి ఇమేజ్ ఉంది. అతని సినిమాలు థియేటర్స్ లోకి వస్తుందంటే ఫ్యాన్స్ ఎగబడిపోతారు.

ప్రస్తుతం విజయ్ క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkatprabhu) డైరెక్షన్‌‌లో ద గోట్(The Greatest of All Time) అనే టైం ట్రావెల్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ విజయ్ 68 వ చిత్రంగా రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) విజయ్కి జోడీగా నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో విజయ్ చెల్లి పాత్రకు ఇంపార్టెన్స్ ఉండటంతో లవ్ టుడే బ్యూటీ ఇవానా(Ivana)ని టీమ్ సంప్రదించినట్లు సమాచారం. అయితే, చెల్లి పాత్రలో చేయడానికి ఆమె నో చెప్పేశారట. అందుకు కారణం లేకపోలేదు..మంచి ఫామ్లో ఉన్న ఇవానాకు చెల్లి క్యారెక్టర్ అంటే..ఫ్యూచర్ సినిమాలకు ఎఫెక్ట్ పడుతుందని ఆమె నో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ..ఇవానా చెల్లిగా చేస్తుందంటే ఆడియన్స్ కూడా ఒప్పుకోరేమో! చాలా సెన్సిటివ్ క్యారెక్టర్ తో..క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రాళ్లకు తన ఫస్ట్ సినిమాతోనే నచ్చేసింది. కనుక, తనని హీరోయిన్గా చూడటానికి మాత్రమే యూత్ ఒప్పుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఫలితంగా ఇవానాకు బదులు నటి-మోడల్ అభియుక్తని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట.

విజయ్ ద గోట్ మూవీలో స్నేహ, ప్రభుదేవా, అజ్మల్, ప్రశాంత్ కీలక పాత్రలు పోషస్తున్నారు. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అర్చన కల్పతి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు రీసెంట్గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ తీసిన సంగతి తెలిసిందే. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ivana (@i__ivana_)