47 ఏళ్ళ వయసులో రేర్ ఫీట్.. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గెలిచిన నటి ప్రగతి

47 ఏళ్ళ వయసులో రేర్ ఫీట్.. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గెలిచిన నటి ప్రగతి

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రగతి(Pragathi) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. చాలా సినిమాల్లో అమ్మగా, అత్తగా, చెల్లిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. కేవలం సినిమాలతోనే కాకండా.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు ప్రగతి. అందులో తన జిమ్ వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఆమె వర్కౌట్స్ చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్స్ కూడా పెడుతుంటారు నెటిజన్స్. ప్రగతి మాత్రం అవేమి పట్టించుకునేవారు కాదు. తన పనితాను చేసుకునేది. 

అయితే.. ప్రగతి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు అర్థమైంది. తాజాగా ఆమె సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ 2024లో పాల్గొన్నారు. ఆమె ఈ పోటీల్లో సిల్వర్ పథకాన్ని సాధించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 47 ఏళ్ళ వయసులో కష్టపడి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో సౌత్ ఇండియన్ ఛాంపియన్ గా నిలవడంతో.. ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్స్. మనిషికి సాధించాలనే కోరిక ఉంటె దానికి వయసుతో సంబందంలేదు అని ప్రూవ్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.