ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్లో బట్టలు లేకుండా.. నటి బోల్డ్ స్టేట్మెంట్!

ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్లో బట్టలు లేకుండా.. నటి బోల్డ్ స్టేట్మెంట్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వన్డే వరల్డ్‌ కప్‌(World cup) ఫీవర్ నడుస్తోంది. ఈ మెగా క్రికెట్ సంగ్రామంలో టీమ్‌ ఇండియా తన సత్తా చాటుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ పోరులో భారత్‌ ఘాన విజయం సాధించింది. ఇక ఆదివారం(నవంబర్ 19) జరగనున్న ఫైనల్‌ కోసం ప్రతీ భారతీయుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. 

also read :- AUS vs RSA: సఫారీలను బెంబేలిస్తున్న స్టార్క్, హేజిల్‌ వుడ్‌.. 24 పరుగులకే 4 వికెట్లు

ఈ నేపథ్యంలో ఓ తెలుగు హీరోయిన్‌ సంచనల ప్రకటన చేశారు. ఇండియా కప్‌ గెలిస్తే వైజాగ్‌ బీచ్‌లో నగ్నంగా తిరుగుతాను అని బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు రేఖ భోజ్‌. ‘కాలాయ తస్మై నమః అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అంతకుముందు లవ్‌ ఇన్‌ వైజాగ్‌, డర్టీ పిక్షర్‌ అనే సినిమాల్లో నటించారు. 

తాజాగా ఈ అమ్మడు ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే నగ్నంగా వైజాగ్‌ బీచ్‌లో తిరుగుతాను అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఆమె.. ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే.. నేను వైజాగ్‌ బీచ్‌లో స్ట్రీకింగ్‌(బట్టలు లేకుండా తిరగటం) చేస్తాను.. అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.