Sreeleela: కర్మన్‌ ఘాట్‌లో సినీ నటి శ్రీలీల సందడి

Sreeleela: కర్మన్‌ ఘాట్‌లో సినీ నటి శ్రీలీల సందడి
  •     మాంగళ్య షాపింగ్‌ మాల్‌ 12వ స్టోర్‌‌ ప్రారంభం

దిల్‌సుఖ్‌నగర్, వెలుగు: కర్మన్‌ఘాట్‌లో  సినీ నటి శ్రీలీల సందడి చేశారు. శుక్రవారం ఆమె మాంగళ్య షాపింగ్‌ మాల్‌ 12వ స్టోర్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్టేజీపై నుంచి అభిమానులతో మాట్లాడి జోష్‌ నింపారు. త్వరలో తను నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్  మూవీ విడుదలకు ఉందని, ఆదరించాలని కోరారు.  

అనంతరం షాపింగ్ మాల్‌లోని పట్టు, ఫ్యాన్సీ చీరల విభాగాలు, మహిళలు, పురుషులు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన వస్త్ర విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధునాతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలతో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నదని తెలిపారు. కర్మన్‌ఘాట్‌లో కొత్త స్టోర్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ స్టోర్‌లో ఫ్యాన్సీ, కంచి, ధర్మవరం, ఉప్పాడ పట్టు చీరలతోపాటు ఆధునిక కలెక్షన్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 

వివాహాలు, శుభకార్యాలు, పండుగల సందర్భంగా అవసరమైన అన్ని రకాల వస్త్రాలు ఒకేచోట లభించడం మాంగళ్య ప్రత్యేకత అని అన్నారు. మాంగళ్య షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్లు పీఎన్‌ మూర్తి, కాసం నమశ్శివాయ మాట్లాడుతూ.. మాంగళ్య షాపింగ్ మాల్స్​కు వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ29 స్టోర్స్ ఉన్నాయని.. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్యకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. తమను ఆదరిస్తున్నందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.