భక్త కన్నప్పలో కామెడీ కింగ్స్.. ఫొటోస్ వైరల్

 భక్త కన్నప్పలో కామెడీ కింగ్స్.. ఫొటోస్ వైరల్

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భక్త కన్నప్ప (Bhakta Kannappa). మంచు విష్ణు ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో మోహన్ బాబు (Mohan Babu) తెరకెక్కిస్తోన్నారు. ఇటీవలే న్యూజిలాండ్ లో గ్రాండ్గా షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్ ఇక రీసెంట్గా ఓ  యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రికరిస్తుండగా మంచు విష్ణుకి జరిగిన ప్రమాదంతో.. షూటింగ్కు కాస్తా బ్రేక్ పడింది. ప్రస్తుతం విష్ణు కోలుకుంటున్నాడని మోహన్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. 

లేటెస్ట్ గా భక్త కన్నప్ప లో నటించబోయే టాలీవుడ్ కామెడీ కింగ్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ తో ఆకట్టుకునే నటి సురేఖా వాణి తన ఇన్ స్టా లో ఫోటో పోస్ట్ చేస్తూ..భక్త కన్నప్ప టీంలో జాయిన్ అయినందుకు సంతోషంగా ఉందంటూ తెలిపారు.

ఈ ఫోటోలో హాస్యనటుడు బ్రహ్మానందం, రఘుబాబు, సప్తగిరి ఇలా కమెడియన్లంతా భక్త కన్నప్పలో సందడి చేస్తోన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు..ఈ ఫోటోలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లుక్ అదిరిపోయిందంటూ మంచు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. న్యూజిలాండ్ వెళ్లిన ఈ కామెడీ పరివారం అంత ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుందొన్డని సమాచారం. 

మహాభారతం సీరియల్ తీసిన డైరెక్టర్ ముకేష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ  సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తాడంటూ వార్తలు వినిపిస్తోన్నాయి. త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.