Vijayashanthi Birthday: లేడీ బాస్ ఈజ్ బ్యాక్.. NKR 21 మూవీ నుండి పవర్ఫుల్ వీడియో రిలీజ్

Vijayashanthi Birthday: లేడీ బాస్ ఈజ్ బ్యాక్.. NKR 21 మూవీ నుండి పవర్ఫుల్ వీడియో రిలీజ్

లేడీబాస్ విజయశాంతి మరోసారి పవర్ ఫుల్ పాత్రలో ఆడియన్స్ ను అలరించడానికి సిద్దమయ్యారు. చాలా కాలం తరువాత ఆమె మళ్ళీ తెరపై కనిపించనున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె ఇటీవలే సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మళ్ళీ తెరపై కనిపించారు. ఇప్పుడు మరోసారి మరో సినిమాలో మరో డైనమిక్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోహా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అనే కొత్త దర్శకుడు ఒక సినిమా చేస్తున్నారు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం విజయశాంతిని ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా జూన్ 24 విజయశాంతి పుట్టినరోజు సంధర్బంగా ఈ సినిమా నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 

ఈ సినిమా కోసం విజయశాంతి మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఖాకీ డ్రెస్ లో విలన్స్ ను ఇరగ్గొడుతూ యాక్షన్ సీన్స్ చేస్తున్న విజయశాంతి వీడియో నెక్స్ట్ లెవల్లో ఉండటమే కాదు.. సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ వీడియో విడుదల చేసి విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్. ఇక NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.