బస్తర్ మూవీలో మావోయిస్టుగా అదాశర్మ

బస్తర్ మూవీలో మావోయిస్టుగా అదాశర్మ

పలు చిత్రాల్లో  హీరోయిన్‌‌గా గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకున్న అదా శర్మ.. ప్రస్తుతం లీడ్ రోల్స్‌‌లో వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్‌‌గా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌‌గా గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ టీమ్‌‌తో మరో ప్రాజెక్టు చేస్తోంది అదా శర్మ. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ‘బస్తర్’ అనే టైటిల్‌‌ను ప్రకటించారు.

ది నక్సల్ స్టోరీ అనేది ట్యాగ్‌‌లైన్.  సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌‌లాల్ షా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.  ఇందులో అదాశర్మ మావోయిస్టు లీడర్‌‌‌‌గా కనిపించబోతుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘ఈ చిత్రం కోసం వందమంది ముందు ఆడిషన్ ఇచ్చాను.

‘ది కేరళ స్టోరీ’ చిత్రంలానే  దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్‌‌ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ‘కేరళ స్టోరీ’ టీమ్ అంతా కలిసి చేస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.