ఆదా కండీషన్స్ : కాబోయేవాడికి నో పెగ్గు, నో ముక్క  

ఆదా కండీషన్స్ : కాబోయేవాడికి నో పెగ్గు, నో ముక్క  

హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదాశర్మ పెళ్లికి రెడీ అంటోంది. అయితే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పి, కుర్రోళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తనకు పెళ్లికొడుకు కావాలంటూ ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆదా..అతడికి ఉండాల్సిన లక్షణాల గురించి ట్వీట్ చేసింది. “కలర్, కులం, పాలోవర్స్, రాశి..వంటి విషయాలని పట్టించుకోను. నాకు కాబోయేవాడు ఉల్లిపాయలు తినకూడదు. మూడు పూటలు వంట చేయాలి. డ్రెస్సింగ్ స్టయిల్ ట్రెడిషనల్ గా ఉండాలి. రోజుకు 5 లీటర్ల నీరు అందిస్తాను కానీ..మద్యం, మాంసాహారం ఇంటా బయటా నిషేదం. అన్ని సినిమాలను ఎంజాచ్ చేసే క్యారెక్టర్ ఉండాలి”. అంటూ కండిషన్స్ పెట్టింది ఆదాశర్మ.

ప్రస్తుత జనరేషన్ లో ఇలాంటి లక్షణాలున్న అబ్బాయి దొరకాలంటే కష్టామే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు ఆదా ఫ్యాన్స్. మరికొంత మంది నేను రెడీ ఆదా..నీ కోసం పెగ్గు, ముక్క వదులుకుంటానంటూ కామెంట్స్ చేస్తూ ఆట పట్టిస్తున్నారు. ఇటీవల రాజశేఖర్ తో కల్కి సినిమాలో నటించిన ఆదాశర్మ..ప్రస్తుతం హిందీలో కంమాండో 3, బైపాస్ రోడ్ మూవీస్ లో నటిస్తుంది.