జ్యోతిష్యం: అధికమాసం.. అరుదైన నెల.. జూన్13 న అరుదైన యోగం.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్యం: అధికమాసం.. అరుదైన నెల.. జూన్13 న అరుదైన యోగం.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

పంచాంగం ప్రకారం అధికమాసం కొనసాగుతుంది.  అధిక జ్యేష్ఠమాసంలో జూన్ 13న శని త్రయోదశి, మాసశివరాత్రి అరుదైన యోగం ఏర్పడింది. శని దోషాల నుంచి ఉపశమనం పొందడానికి, శివానుగ్రహం కోసం 33 మారేడు దళాలతో పూజ, నక్త వ్రతం, ప్రత్యేక దానాలు చేయాలని పండితులు చెబుతున్నారు.  శాస్త్రాలు సూచించిన ఈ పరిహారాల గురించి తెలుసుకుందాం. . ! 

సమస్త ప్రాణకోటి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు.జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు. ఇద్దరూ న్యాయాధిపతులే.అయినా వీరిలో ఈ లోకంలోని జీవుల పాపపుణ్యాలను బట్టీ ఇక్కడే దోషాలను పరిహరించే బాధ్యతను నిర్వర్తిస్తున్న శనికి విశిష్ట స్థానం ఉంది. శని బాధలనుంచి ఉపశమనం పొందేందుకు శనిత్రయోదశి రోజున శని భగవానుడికి పూజ.. మాస శివరాత్రి రోజున పరమేశ్వరుని అభిషేకం... బిల్వ పత్రాతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. 

ఈ ఏడాది ( 2026) జూన్​ 13 శనివారం.. ఉదయం త్రయోదశి .. సాయంత్రం చతుర్దశి ఉండటంతో .. మాస శివరాత్రి.. శని త్రయోదశి రెండూ ఒకే రోజు వచ్చాయి.  దీనివలన జూన్​ 13న ఏర్పడే యోగాల వలన.. ఆ సమయంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే జీవితంలో కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.

అశ్వత్థ రావిచెట్టుచుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పాలలో నల్లనువ్వులు కలిపి చెట్టుమొదట్లో పోయండి ఓం నమోనారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పోయాలి. జూన్​ 13 న ఉదయం శనిత్రయోదశి తైలాభిషేకం ..  మాసశివరాత్రి సాయంత్రం (ప్రదోషం) పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. ఇంట్లో ఆవునేతి దీపారాధన .. శివపూజ చేసినట్లైతే  గ్రహ, గృహ, గోచార, రుణ, రణ, రోగ, ఆర్థిక, వ్యాపార, వృత్తి, ఉద్యోగ ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుందని పండితుల ద్వారా తెలుస్తుంది.

 అధిక మాసంలో 33 సంఖ్యకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని పురాణాలు వివరిస్తాయి. పురాణాల ప్రకారం ప్రకారం 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, ఎనిమిది మంది వసువులు, ఇద్దరు  అశ్విని దేవతలు కలిపి మొత్తం 33 మందిని దేవతా శక్తులు అంటారు.  అందుకే అధికమాసంలో  33 సంఖ్యతో చేసే దానాలు, పూజలు .. నైవూద్యాలు సమర్పిస్తే జాతక దోషాలు పూర్తిగా తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  

జూన్​ 13 శని త్రయోదశి+ మాస శివరాత్రి కావున  పరమేశ్వరుడి 33 మారేడు దళాలతో శివార్చన చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. శని త్రయోదశి లేదా.. మాస శివరాత్రి రోజున శివుడిని వాటితో పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించేటప్పుడు “ఓం నమః శివాయ” మంత్రాన్ని ప్రతిసారి జపించాలి. ఇలా చేయడం వల  మనోశాంతి, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. 

శని శ్లోకం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం

శని త్రయోదశి రోజు ( జూన్​ 13)  పాటించాల్సిన నియమాలు

  • సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి
  • ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అనంతరం భోజనం చేయాలి
  • శని త్రయోదశి రోజు మద్యమాంసాలు ముట్టుకోరాదు
  • శివార్చన, ఆంజనేయ స్వామి ఆరాధన.. ప్రదోషకాలంలో పరమేశ్వరునికి అభిషేకంచేయడం  ద్వారా శని ప్రభావం తగ్గుతుంది
  • మారేడు దళాలతో శివుడిని పూజిస్తే  "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి
  • ఆకలితో అలమటించేవారికి భోజనం పెట్టాలి, మూగజీవాలకు కూడా
  • ఎవరి వద్ద నుంచి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తీసుకోవద్దు
  • శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయం లో ప్రసాదం పంచండి
  • నువ్వుల ఉండను కాకికి తినిపించడం మంచిది
  • శనివారం రోజు రొట్టెపై నువ్వులు వేసి కుక్కలకు పెడితే శని ప్రభావం తగ్గుతుంది
  •  ఆంజనేయుడి ఆరాధన వలన శనిప్రభావం తగ్గుతుంది, సుందరకాండ పారాయణం చేయండి
  • కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు ,నల్ల నువ్వులు, మేకు శనికి నమస్కరించి వేయండి
  • బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు పెడితే శనిప్రభావం తగ్గుతుంది
  • శనివారం రోజు శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టి, నల్లటి దుప్పటి దానం చేస్తే మంచిది

అధికమాసం శని త్రయోదశి.. మాస శివరాత్రి రోజు ( జూన్​ 13)న చేయవలసిన దానాలు

  • 33 అరిసెలు లేదా అప్పాలు దానం చేయడం
  • అన్నదానం నిర్వహించడం
  • తాగునీరు లేదా జలదానం చేయడం
  • ధాన్యాలు దానం చేయడం
  • అవసరమైన వారికి వస్త్రదానం చేయడం
  • ఇలాంటి దానాలు చేయడం ద్వారా శని అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.