కన్నెపల్లిపై కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి దొంగ ఏడుపులు..గోదావరి నీళ్లను వృథాగా పోనీయట్లేదు : ఆది శ్రీనివాస్ 

కన్నెపల్లిపై కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి దొంగ ఏడుపులు..గోదావరి నీళ్లను వృథాగా పోనీయట్లేదు : ఆది శ్రీనివాస్ 

హైదరాబాద్, వెలుగు: కమీషన్లకు కక్కుర్తిపడి  రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతోందని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ గురించి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పుత్రరత్నం కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్చివాగుడు వాగుతూనే ఉన్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరి నుంచి నీళ్లు కిందకు అన్యాయంగా వెళ్లిపోతున్నాయని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు.

ఆ నీళ్లు ఎక్కడికీ పోవు. తెలంగాణ అవసరాల కోసమే వాడుతున్నాం. దేవాదుల నీళ్లను నిరంతరం ఎత్తిపోస్తున్నాం. తర్వాత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఉన్న సీతారామ ఎత్తిపోతలతో నీటిని ఒడిసిపడుతున్నాం. తెలంగాణ నుంచి వెళ్లే గోదావరి నీటిని మా ప్రభుత్వం సంపూర్ణంగా వినియోగించుకుంటోంది. కాళేశ్వరం నుంచి వెళ్లిపోయిన నీళ్లన్నీ ఏపీకి పోతున్నాయని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయన భజన బృందం తప్పుడు ప్రచారం చేస్తోంది” అని ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

మేడిగడ్డ కుంగిపోయిన విషయం ఈ సన్నాసుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపైన ఇప్పటి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్షమాప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ చెప్పలేదన్నారు.  కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నింపితే కొట్టుకుపోవడం ఖాయమని ఎన్డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఇచ్చిన నివేదిక కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ఎప్పుడైతే కూలేశ్వరం అయిందో, ఆనాడే కల్వకుంట్ల కుటుంబం ఖతం అయిందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రూ.1,500 కోట్లు ఎలా వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చాయని నిలదీశారు.  మీరెన్ని అబద్ధాలు చెప్పినా మిమ్మల్ని జనం పట్టించుకోరని విమర్శించారు. తెలంగాణకు ప్రతి చుక్కను తమ ప్రభుత్వం ఒడిసిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డుతుందని, రైతుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తుందని స్పష్టం చేశారు.