ఆదిలాబాద్ : సీసీఐ ట్యాంకర్లు నేలమట్టం ..రెండు భారీ ట్యాంకర్లు కూల్చివేత

ఆదిలాబాద్ : సీసీఐ ట్యాంకర్లు నేలమట్టం ..రెండు భారీ ట్యాంకర్లు కూల్చివేత

ఆదిలాబాద్, వెలుగు :  సీసీఐ ఫ్యాక్టరీ అంటే గుర్తుకొచ్చే ఆ రెండు భారీ ట్యాంకర్లు నేలమట్టమయ్యాయి. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు గుండెకాయలాంటి ట్యాంకర్లు కిలోమీటర్ల దూరం నుంచి సైతం ప్రజలకు కనిపించేవి. 

సీసీఐ మూత పడటంతో కొన్ని నెలలుగా ఒక్కో  భవనాన్ని కూల్చివేస్తుండగా, గురువారం భారీ రెండు ట్యాంకర్లను బ్లాస్టింగ్ చేసి నేలమట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ కింద సీసీఐని కూల్చివేసేందుకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ పూర్తి స్థాయిలో పరిశ్రమను  కూల్చివేశారు.