ఆదిలాబాద్జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దేగామలో గంగనీళ్ల జాతర ఘనంగా నిర్వహించారు. శనివారం గ్రామంలోని కేసు వారి కుటుంబ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పోచమ్మ ఆలయంలో అమ్మవారి ఆభరణాలతో సోన్ గంగకు చేరుకున్నారు.
ఆదివారం ఉదయం సోన్ గంగాలో ఆభరణాలు శుద్ధి చేసి పూజలు చేశారు. అక్కడి నుంచి మండలంలోని అడేగామ, పిప్పిరి, గిర్నూర్ గ్రామల్లో అమ్మవారిని ఊరేగింపుగా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం దేగామలోని పోచమ్మ ఆలయానికి చేరుకొని తల్లికి ఆభరణాలు అలంకరించారు.
