కశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణలోని ఖండాల .. కమ్మేసిన పొగమంచు.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం

కశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణలోని ఖండాల .. కమ్మేసిన పొగమంచు.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం

కనుచూపు మేరంతా పచ్చదనం, కమ్మేసిన పొగమంచుతో కూడిన ఖండాల ప్రాంతం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న, తెలంగాణ కశ్మీర్ గా ప్రసిద్ధి చెందిన ఖండాల గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారింది. ఎటు చూసినా పచ్చదనం, కొండల పైనుంచి జాలువారే జలపాతాలు, పొగమంచుతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వర్షాకాలపు అందాలను వీక్షించేందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.