ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి అందాలు నిత్యం అబ్బురపరుస్తూనే ఉంటాయి. అడవి నిండా అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. శనివారం మావల హరితవనంలో సూర్యాస్తమయాన ఆకాశమనే కాన్వాస్‌పై ఆకు రాలిన చెట్లతో ప్రకృతి చిత్రాన్ని గీసినట్లుగా కనిపించింది. ఆకురాలిన చెట్ల మధ్య నుంచి తొంగిచూస్తూ సూర్యుడు కిందికి జారుతున్న ఈ సుందరమైన దృశ్యం వెలుగు కెమెరాకు చిక్కింది.
