ఆదిపురుష్ కు పన్ను రాయితీ

ఆదిపురుష్ కు పన్ను రాయితీ

పౌరాణిక, సామాజిక ఇతివృత్తంతో వచ్చిన సినిమాలకు గతంలో రాయితీ ఇచ్చారు. అంతకుముందు గౌతమి పుత్ర శాతకర్ణి మూవీకి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కోసారి కొన్ని సినిమాలకి పన్ను రాయితీ కల్పిస్తోంది. ది కేరళ స్టోరీ మూవీకి యూపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీకి కూడా పన్ను మినహాయింపు ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ మూవీ రామాయణం కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాతో మన భారతీయ ఇతిహాసాన్ని విశ్వవ్యాప్తంగా గ్రాండియర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

ఇక ఈ సినిమాకు బీజేపీ అండదండలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓం రౌత్ భూషణ్ కుమార్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిపి మూవీపై చర్చించారు. రాయితీ వల్ల టికెట్ ధరలు తగ్గి సినిమా ఎక్కువ మంది చూసే అవకాశాలున్నాయని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. జూన్ 11న తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.