ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. లిస్ట్ నుండి ఆ థియేటర్స్ అవుట్

ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. లిస్ట్ నుండి ఆ థియేటర్స్ అవుట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆదిపురుష్ సినిమాను కొన్ని IMAX థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదట. నిజానికి చాలా మంది సినీ లవర్స్  ఏ సినిమానైనా బెటర్ గా ఎక్స్‌పీరెన్స్ చేయడానికి IMAX థియేటర్స్ ను ఆప్షన్ గా ఎంచుకుంటారు. ఎందుకంటే.. IMAX థియేటర్స్  లో పిక్చర్ క్వాలిటీ గానీ, సౌండ్ క్వాలిటీ గానీ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. 

అందుకే ఏదైనా స్పెషల్ మూవీస్ ఉంటే IMAX కు వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇక ఆదిపురుష్ లాంటి విజువల్ వండర్ సినిమాకైతే ఆ ఎక్స్‌పీరిన్స్ వేరే లెవల్లో ఉంది. చాలా మంది కూడా ఈ సినిమాను IMAXలో చూసేందుకు రెడీ అయ్యారు కూడా. అయితే తాజా అప్డేట్ తో ఫ్యాన్స్ ఇంకా సినిమా ;లవర్స్ చాల డిజపాయింట్ అవుతున్నారు. ఈ ఎఫెక్ట్ మూవీ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ పై కూడా పడే అవకాశం ఉంది.

ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను.. టి సిరీస్(T Series) సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం(Ramayanam) కథతో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) రావణాసురిడిగా నటిస్తున్నారు.