ఆదివాసీల ఆందోళన..సిర్పూర్‌‌‌‌యూలో ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా

ఆదివాసీల ఆందోళన..సిర్పూర్‌‌‌‌యూలో ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా

జైనూర్, వెలుగు : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌‌‌‌యూ మండలంలో ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. సిర్పూర్‌‌‌‌యూ, జైనూర్, లింగాపూర్ మండలాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెయిన్ రోడ్డుపై మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. 

ఇందిరమ్మ ఇండ్లు, రోడ్ల నిర్మాణాలను అడ్డుకుంటూ, పేసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అటవీ హక్కులు పొందిన రైతులను అధికారులు వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను విస్మరిస్తే డీఎఫ్​వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

అనంతరం నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎఫ్ఆర్వో రమేశ్​కు అందజేశారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆత్రం భగవత్ రావు, జైనూర్ బీజేపీ మండల అధ్యక్షుడు, ఆదివాసీ నాయకులు పెందోర్ ప్రకాష్, భీంరావు, వివిధ గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.