అడవుల్లో  అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్రాబాద్, కవ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ జంగిల్ సఫారీ

అడవుల్లో  అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అమ్రాబాద్, కవ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ జంగిల్ సఫారీ
  •      మూడు నెలల తరువాత పునఃప్రారంభం
  •      కిన్నెరసానిలో బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అడవిలో జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •      తాడ్వాయిలో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •      నల్లమల నుంచి ఏటూరునాగారం, కవ్వాల్​ దాకా ఎకో-టూరిజం విస్తరణ

నగరాల రణగొణ ధ్వనులకు దూరంగా.. పచ్చని అడవుల మధ్య వన్యప్రాణులను వాటి సహజ ఆవాసాల్లో వీక్షిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం పర్యాటకులకు మళ్లీ అందుబాటులోకి వచ్చింది. వర్షాకాలం ముగియడంతో అమ్రాబాద్, కవ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వుల్లో జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీలు పునఃప్రారంభం కాగా.. కిన్నెరసాని, తాడ్వాయి, పాకాల వంటి అటవీ ప్రాంతాల్లో సఫారీ, బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సాహస కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. దసరా, దీపావళి సెలవుల నేపథ్యంలో తెలంగాణ అడవులు ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమయ్యాయి.

 ప్రకృతి ఒడిలో వన్యప్రాణులను వీక్షించాలనుకునే పర్యాటకులకు ఆ అవకాశం వచ్చేసింది. వర్షాకాలం సంతానోత్పత్తి విరామం ముగియడంతో 3 నెలల తర్వాత తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల్లో జంగిల్ సఫారీలు తిరిగి ప్రారంభమయ్యాయి. దసరా, దీపావళి సెలవుల వేళ సఫారీ రైడ్లు, బోటింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్‌‌‌‌‌‌‌‌లతో సరికొత్త అనుభూతిని పంచేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. అమ్రాబాద్, కవ్వాల్‌‌‌‌‌‌‌‌లలో పునఃప్రారంభమైన జీప్ సఫారీలతో పాటు కిన్నెరసాని, తాడ్వాయి, పాకాల అడవులు అడ్వెంచర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్, వెలుగు:వర్షాకాలంలో వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం కావడంతో మూడు నెలలుగా మూతపడిన అమ్రాబాద్, కవ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పులుల అభయారణ్యాల్లో ఈ నెల 1 నుంచి జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీలు తిరిగి ప్రారంభమయ్యాయి. మరోవైపు తాడ్వాయి, కిన్నెరసాని, పాకాల వంటి ప్రముఖ అటవీ ప్రాంతాల్లో అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల వేళ ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని అందించేలా పర్యాటక, అటవీ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వుల్లో సఫారీలను నిలిపివేస్తారు. తాజాగా వర్షాకాలం ముగియడంతో నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా నల్లమల పరిధిలోని అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫర్హాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద అటవీ అధికారులు జెండా ఊపి సఫారీ వాహనాలను ప్రారంభించారు.

వచ్చే ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఈ సఫారీ సేవలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. మన్ననూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి దట్టమైన అటవీ మార్గం గుండా సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని ఫర్హాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీపుల్లో తీసుకెళ్తారు. చుట్టూ కొండలు, లోయల అందాలతో పాటు జింకలు, నీల్గాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడవి పందులు, ఎలుగుబంట్లు, చిరుతలు, అరుదైన పక్షులను చూసే అవకాశం ఉంటుంది. శుక్రవారం అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఫారీకి వెళ్లిన సందర్శకులకు పెద్దపులి కనిపించింది. అడవుల్లోకి వెళ్లే పర్యాటకులు ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిషేధ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

కిన్నెరసానిలో బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యంలో జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీ రైడ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.45 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ప్రత్యేక ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీ వాహనాలతోపాటు ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లై పార్కులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించారు. ఇక్కడ డీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కిన్నెరసాని వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు ఒక వాహనం, మందారికలపాడులోని హరిణి వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి డీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మరో వాహనం ద్వారా దాదాపు 8 కిలోమీటర్ల మేర అడవిలో సఫారీ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగుతుంది. దట్టమైన అడవులు, చెరువులు, కొండల నడుమ తిరుగుతూ వన్యప్రాణులను వీక్షించే అవకాశం దక్కుతోంది. పర్యాటకులకు అభయారణ్య విశేషాలను వివరించడానికి అనుభవజ్ఞులైన ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వాచర్లు కూడా సఫారీలో తోడుగా ఉంటారు. చుట్టూ కొండలు, మధ్యలో అటవీ దీవులతో ఉండే కిన్నెరసాని రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంతో సుందరంగా ఉంటుంది. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదుపాయం కూడా ఉంది.

ఆకట్టుకునే తాడ్వాయి ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

తాడ్వాయి అటవీ ప్రాంతంలోనూ సఫారీ, అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. లక్నవరం, తాడ్వాయి, బొగతాలను కలుపుతూ అటవీ శాఖ రూపొందించిన ఎకో టూరిజం సర్క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాడ్వాయి ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వనజీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వద్ద బస చేసే పర్యాటకుల కోసం దట్టమైన అడవి గుండా ఐలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్లే 20 కిలోమీటర్ల జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీ అందుబాటులో ఉంది. దీనితో పాటు అడవిలో 5 కిలోమీటర్ల మేర ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్లు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సఫారీ ప్రయాణంలో అడవి కోళ్లు, నెమళ్లు, మచ్చల జింకలు, సాంబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జింకలు, అరుదైన మలబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్విరల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వివిధ రకాల పక్షులను చూసే అవకాశం ఉంటుంది.

గైడులుగా గిరిజనులు, చెంచులు..

అడవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండటంతోపాటు స్థానిక గిరిజనులకు, చెంచులకు గైడులుగా, డ్రైవర్లుగా ఉపాధి లభిస్తోంది. దసరా, దీపావళి సెలవులు మొదలవుతుండడంతో అడవులను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ముందుగానే సఫారీ, కాటేజీల బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

జన్నారం అడవుల్లో జీపు సఫారీ..

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని కవ్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సఫారీలు పునఃప్రారంభం కావడంతో సందడి మొదలైంది. జన్నారం ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్లలో జీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీ నిర్వహిస్తారు. ఇది దట్టమైన టేకు, వెదురు అడవుల గుండా సాగుతుంది. అడవి దున్నలు, సాంబార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కృష్ణజింకలు, నెమళ్లు, వివిధ రకాల పక్షులు, చిరుతలతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి ఇక్కడికి పులులు వలస వస్తుంటాయి. సఫారీతోపాటు సమీపంలోని కడెం డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గండి రామన్న హరితవనం వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. జన్నారంలో తెలంగాణ టూరిజం హరిత రిసార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అటవీ శాఖ గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొత్త అనుభూతి..

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని చారిత్రక పాకాల సరస్సు చుట్టూ ఉన్న అభయారణ్యంలోనూ అటవీ శాఖ జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సఫారీ వాహనాలు, బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సదుపాయాలను కల్పిస్తోంది. పాకాల అభయారణ్యంలోని బయోడైవర్సిటీ పార్కులో చేపట్టిన పలు అభివృద్ధి పనులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ రాత్రిపూట కూడా బస చేసేందుకు వసతులు కల్పించారు. సరస్సు కట్ట వెంబడి పాకాల ప్రత్యేకతలను తెలిపేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి కోసం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నెలకొల్పారు. పాకాల అభయారణ్యంలో సఫారీ చేయొచ్చు. పర్యాటకులు బయోడైవర్సిటీ పార్కు నుంచి పాకాల దట్టమైన అడవుల్లో దాదాపు 9 కిలోమీటర్ల మేర సఫారీ వాహనంలో ప్రయాణించవచ్చు.

చిలుకమ్మనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా సాగే ఈ ప్రయాణంలో ప్రసిద్ధ చిలుకలగుట్ట వ్యూ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించవచ్చు. సుమారు 839 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అభయారణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వన్యప్రాణులు వాటి సహజ ఆవాసాల్లో కనిపిస్తాయి. పాకాల కట్ట వెంబడి సందర్శకులు ప్రయాణించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ‘సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ద్వారా గంటకు రూ.20 చొప్పున సైకిళ్లను అద్దెకిస్తున్నారు. అంతేకాదు, పాకాల సరస్సులో బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌకర్యం కూడా ఉంది.