ఏ వతన్‌‌ మేరే వతన్‌‌ మూవీ మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌‌

ఏ వతన్‌‌ మేరే వతన్‌‌ మూవీ మార్చి 21 నుంచి స్ట్రీమింగ్‌‌

సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఏ వతన్‌‌ మేరే వతన్‌‌’. కణ్ణన్‌‌ అయ్యర్ ద‌‌ర్శకుడు. కరణ్ జోహార్ నిర్మాత. సెప్టెంబర్‌‌‌‌ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యమైంది. తాజాగా కొత్త రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. అయితే థియేటర్స్‌‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. వరల్డ్‌‌ రేడియో డే సందర్భంగా మార్చి 21 నుంచి అమెజాన్‌‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌‌ చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌‌ ఆకట్టుకుంది. క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అప్పట్లో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపడానికి ఉషా మెహతా అనే మహిళ అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌ రేడియో స్టేషన్స్‌‌ ఏర్పాటుచేశారు. ఆమె సేవలకు 1998లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌‌తో సత్కరించింది. ఆమె జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందుకే వరల్డ్‌‌ రేడియో డేకి విడుదల చేస్తున్నారు. ఇమ్రాన్‌‌ హష్మి, సచిన్‌‌ ఖేడ్కర్‌‌, అభయ్‌‌ వర్మ, స్పార్ష్‌‌ శ్రీవాత్సవ, అలెక్స్‌‌ ఓ నేలి, ఆనంద్ తివారి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.