ఫేవరెట్‌‌గా అఫ్గానిస్తాన్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో నెదర్లాండ్స్‌‌తో కీలక పోరు

ఫేవరెట్‌‌గా అఫ్గానిస్తాన్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో నెదర్లాండ్స్‌‌తో కీలక పోరు
  • మ. 2 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌, హాట్‌‌స్టార్‌‌లో లైవ్‌‌

లక్నో: వరల్డ్‌‌ కప్‌‌లో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గానిస్తాన్‌‌.. వరల్డ్‌‌ కప్‌‌లో మరో పోరుకు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో పసికూన నెదర్లాండ్స్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పాకిస్తాన్‌‌, శ్రీలంకలాంటి మేటి జట్లకు షాకిచ్చిన అఫ్గాన్‌‌ ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉంది. అయితే డచ్‌‌పై భారీ విజయంతో పాయింట్లతో పాటు నెట్‌‌ రన్‌‌రేట్‌‌ను మెరుగుపర్చుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది.

గత మ్యాచ్‌‌ల మాదిరిగానే స్పిన్‌‌ త్రయం రషీద్‌‌ ఖాన్‌‌, మహ్మద్‌‌ నబీ, ముజీబ్‌‌ అఫ్గాన్‌‌కు కొండంత బలం. ఇక బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ హష్మతుల్లా షాహిది (226), అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌ (203), రహమానుల్లా గుర్బాజ్‌‌ (224), రహమత్‌‌ షా (212), ఇబ్రహీం జద్రాన్‌‌ (212) ఫామ్‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు డచ్‌‌ కూడా సంచలనంపై దృష్టి పెట్టింది. నాకౌట్‌‌ చేరే చాన్స్‌‌ లేకపోయినా వరల్డ్‌‌ క్రికెట్‌‌లో తమ ఉనికిని మరింతగా చాటాలని చూస్తోంది. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ ఎడ్వర్డ్స్‌‌ రెండు హాఫ్‌‌ సెంచరీలతో ఫామ్‌‌లో ఉన్నాడు. 

ALSO READ : అర్జున్‌‌ ఏడో గేమ్‌‌ డ్రా