Gautam Gambhir: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు (జులై 25, శనివారం) తన పదవికి రాజీనామా చేసిన తర్వాత సోషల్ మీడియాలో భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి బాటలోనే గంభీర్ కూడా తన కోచ్ పదవికి రాజీనామా చేయాలంటూ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున మీమ్స్ తో డిమాండ్ చేస్తున్నారు.
గంభీర్ రాజీనామా చేయాలని ఫ్యాన్స్ డిమాండ్:
2024లో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతడి హయాంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ లాంటి విజయాలు సాధించినప్పటికీ, అనేక పరాజయాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని మూలంగా గత కొంతకాలంగా గంభీర్ రాజీనామా చేయాలంటూ పెద్దెత్తున్న ఫ్యాన్స్, నెటిజన్స్ కోరుతున్నారు.
* సొంత గడ్డపై ఓటములు: స్వదేశంలో రెండు టెస్టు సిరీస్‌లను కోల్పోవడంతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా భారత్ చేజార్చుకుంది.
* షాకింగ్ వైఫల్యాలు: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కోల్పోవడం, అలాగే 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు అప్పగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
* డ్రెస్సింగ్ రూంలో గొడవలు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో గంభీర్‌కు అభిప్రాయ భేదాలు ఉన్నట్లు వార్తలు రావడం కూడా క్రికెట్ అభిమానులలో అసంతృప్తిని పెంచింది.
* గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఉన్నప్పటికీ, అతడి స్థానంలో కొత్త కోచ్‌ను నియమించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ నెక్ట్స్ అసైన్‌మెంట్ ఏంటి?:
ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే టీ20 సిరీస్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దూరంగా ఉన్నారు. అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా వచ్చే నెల (ఆగస్టు 15 నుంచి) గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమయ్యే శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌తో గంభీర్ మళ్లీ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
* డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: ఈ శ్రీలంక సిరీస్ 2025–27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC)లో భాగం కావడంతో వచ్చే ఏడాది ఓవల్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్‌కు భారత్ అర్హత సాధించాలంటే ఈ సిరీస్ విజయం గంభీర్‌కు అత్యంత కీలకంగా మారింది.
After Dharmendra Pradhan, it's time for Gautam Gambhir to resign for the betterment and protection of Indian cricket.#BCCI #GautamGambhir
— CricInformer (@CricInformer) July 25, 2026
🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨
— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026
Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364
🚨 BREAKING NEWS 🚨
— Muffatball vikrant (@Vikrant_1589) July 25, 2026
🚨 NEW PROTEST LIKELY AS INDIAN CRICKET FANS DEMAND GAUTAM GAMBHIR'S RESIGNATION 🚨
Following India's recent performances, frustration among a section of Indian cricket fans continues to grow. Reports suggest that some fan groups are planning fresh protests… pic.twitter.com/QykmIy19OH
