Article 370 Movie: ఆర్టికల్ 370ని షేధించిన గల్ఫ్‌ దేశాలు..హిందీ చిత్రాలకు తప్పని చిక్కులు

Article 370 Movie: ఆర్టికల్ 370ని షేధించిన గల్ఫ్‌ దేశాలు..హిందీ చిత్రాలకు తప్పని చిక్కులు

కాశ్మీర్ హింస‌, తీవ్ర‌వాదంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370(Article 370). ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది.ఇందులో పవర్‌ఫుల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌గా యామి గౌతమ్ (Yami Gautam) నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇండియాలో మాత్రమే కాదు..ఓవర్సీస్‌లో కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ పొలిటికల్ డ్రామాను కొన్ని దేశాలు నిషేధం విధించడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ఎందుకంటే..రెండు నెలల్లో రెండు హిందీ చిత్రాలు అక్కడ విడుదలకు అనుమతి పొందలేకపోయాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో హిందీ సినిమాలకు ఉన్న మార్కెట్ పూర్తిగా దెబ్బతింటున్నట్టు ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 

జిహాదీ పేరుతో క‌శ్మీర్‌లో సాగించే భారీ వ్యాపారంపై..జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ప్రధాన అంశంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాను గల్ఫ్‌ దేశాలన్నీ నిషేధం విధించాయి. ఆర్టికల్ 370 మూవీని బ్యాన్‌ చేయడంపై స్పష్టమైన కారణాలు లేనప్పటికీ..ఈ సినిమాలో పాకిస్తాన్‌ కు సంబంధించిన కొన్ని సున్నిత సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే,  గల్ఫ్ దేశాల్లో సినిమాను రిలీజ్ చేయాలంటే..అక్కడి సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది

ఆర్టికల్ 370 మూవీ రిలీజ్ కు ముందు..ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ మీటింగ్‌లో దీన్ని ప్రస్తావించారు. కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ఇలాంటి చిత్రాలను తప్పకుండా అందరూ చూడాలని ఆయన అన్నారు. ఇక ‘రామాయణ్’ ఫేమ్ అరుణ్ గోవిల్..ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కనిపించారు. 

వివరాల్లోకి వెళితే..

జమ్ము కశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసింది. దీంతో జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక స్టేటస్‍ను ఎత్తేస్తూ..భారత ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కూడా అక్కడ చాలా విధాలుగా నిరసనలు జరిగాయి. అయితే, కొన్నాళ్లకు శాంతి భద్రతలను..కొంతమేరకు స్వేచ్ఛను ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. ఈ అంశంపైనే  ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

అయితే, ఇటీవల కొన్ని భారతీయ చిత్రాలను గల్ఫ్‌ దేశాల్లో బ్యాన్ చేయడం పలు వివాదాలకు దారితీస్తోంది. రీసెంట్ గా వచ్చిన హృతిక్ రోషన్ ‘ఫైటర్‌’ను కూడా బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. యూఏఈ మినహా ఎక్కడా కూడా ‘ఫైటర్‌’ మూవీని ప్రదర్శించలేదు.అలాగే మమ్ముట్టి నటించిన కాదల్ ది కోర్ మూవీని కూడా గల్ఫ్‌ దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది.