రాశి ఖన్నా ఆశలన్నీ ఆ హీరో పైనే..

రాశి ఖన్నా ఆశలన్నీ ఆ హీరో పైనే..

ఏడాది కాలంగా తెలుగు సినిమాలకు దాదాపుగా దూరమైన నటి రాశి ఖన్నా(Rashi Khanna). నాగ చైతన్యతో గతేడాది వచ్చిన ‘థాంక్యూ’ రాశి చివరి సినిమా. ఈ సినిమా కూడా ఆశించిన సక్సెస్​ ఇవ్వలేదు. కానీ, ఊహించని విధంగా ఫర్జీ వెబ్​ సిరీస్​తో ఓటీటీలో ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలిచింది. షాహిద్​ కపూర్​ హీరోగా వచ్చిన ఈ సిరీస్​కు మంచి రెస్పాన్స్​ వచ్చింది.

దీంతో సక్సెస్​ ట్రాక్​ ఎక్కిన రాశి అదే జోష్​తో తెలుగులో ఓ ప్రయోగానికి సిద్ధమైంది. సెలబ్రిటీ దుస్తుల డిజైనర్​గా పేరున్న నీరజ కోన( Neeraja Kona) తెలుసు కదా (Telusu Kada) సినిమాతో మెగాఫోన్​ పట్టనుంది. రైటర్​ కోన వెంకట్​కు ఆమె కజిన్​. ఈ మూవీలో రాశి రోల్​ చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. రాశికన్నా ఆశలన్నీ డీజే సిద్ధు( Siddu jonnalagadda)  పైనే పెట్టుకుంది. ఇది రిలీజైతే తెలుగులో మళ్లీ రాశి మునుపటి క్రేజ్​ను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్​ భావిస్తున్నారు. 

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ సంగీతం అందిస్తున్న తెలుసు కదా ఈ చిత్రానికి.. యువరాజ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తుండగా.. నేషనల్ అవార్డు విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు. ఇక ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ నవంబర్ 15 నుండి మొద‌లు కానుందని సమాచారం.

ఇటీవల కాలంలో రాశి ఖన్నా తన ఫామ్ ను కోల్పోయి..కేవలం సోషల్ మీడియాలో గ్లామర్ కే పరిమితమైంది.ఇక మంచి ఫామ్ లో ఉన్న సిద్దుతో నటించే ఛాన్స్ రావడంతో రాశికన్నా కు కాలం కలిసి వచ్చిందనే విషయం అర్ధం అవుతుంది.