- మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్‌తో మంత్రులు ఉత్తమ్, సీతక్క భేటీ
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వ్యూహంపై ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. ఆ రాష్ట్ర ఇన్చార్జ్ రమేశ్ చెన్నితాల అధ్యక్షతన శుక్రవారం ముంబైలోని తిలక్ భవన్లో జరిగిన ఈ మీటింగ్‌లో మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే, మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, చరణ్ జీత్ చన్నీ, తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి, ఎంపీ వర్షా గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు వ్యూహాలపై చర్చించారు. ముందెన్నడూ లేని రీతిలో ఏఐసీసీ సీనియర్లను, అనుభవజ్ఞులైన నేతలను రంగంలోకి దింపింది. అధికార బీజేపీ, ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేనను ఎదుర్కొని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడే అంశాలపై చర్చించారు.