దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్ ఓటీటీ ప్యాక్స్ విషయంలో నువ్వానేనా అని పోటీపడుతున్నాయి. జియో 200 రూపాయలకే ఓటీటీ పాస్ పేరుతో ఓటీటీ ప్యాక్తో వస్తే.. ఎయిర్ టెల్ కూడా 99 రూపాయలకే ఓటీటీ ప్యాక్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరను నెలకు రూ.99కి తగ్గించింది.
ఈ ప్లాన్ ధర గతంలో 149 రూపాయలు ఉండేది. ఈ ధరను 99 రూపాయలకు తగ్గించడంతో ఓటీటీల్లో కంటెంట్ వీక్షించే ఎయిర్ టెల్ వినియోగదారులకు ఇదో మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఓటీటీ కంటెంట్ కోసం వందలకు వందలు పోసే అవసరం లేకుండా 99 రూపాయలకే 20 OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఎయిర్టెల్ యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్యాక్ నెల రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది.
ఎయిర్ టెల్ 99 రూపాయల ఓటీటీ ప్యాక్ వివరాలు:
* ధర: రూ. 99 (పరిమిత కాల ఆఫర్)
* వ్యాలిడిటీ: నెల రోజులు
* రోజుకు అయ్యే ఖర్చు: రూ. 3.30
* ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో 20 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్
ఈ ప్యాక్లో లభించే OTT ప్లాట్‌ఫామ్స్లో ప్రముఖమైనవి ఏవేవంటే:
* సోనీ లివ్
* సన్ NXT
* ఆహా
* ఈరోస్ నౌ
* లయన్స్‌గేట్ ప్లే
వీటితో పాటు మరో 15 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్లో కంటెంట్ వీక్షించే అవకాశం ఉంటుంది. సబ్‌స్క్రైబర్‌లకు షోలు, సినిమాలు, మరియు ప్రత్యక్ష క్రీడలకు కొరత ఉండదు. నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ కూడా కావాలంటే..
ఎయిర్‌టెల్ కస్టమర్లు రూ. 279 ప్యాక్ తీసుకుంటే నెల రోజుల పాటు ఓటీటీ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. 1 GB డేటా కూడా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, జియో హాట్‌స్టార్ సూపర్, ZEE5 ప్రీమియం, Xstream Play ద్వారా అదనంగా 20 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందొచ్చు.
