తండ్రి కృష్ణరాజ్ రాయ్ పుట్టినరోజున ఐశ్వర్యరాయ్ ఎమోషనల్ పోస్ట్

తండ్రి కృష్ణరాజ్ రాయ్ పుట్టినరోజున ఐశ్వర్యరాయ్ ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ యాక్ట్రెస్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన తండ్రి కృష్ణ రాజ్ రాయ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ డార్లింగ్ డాడీ- అజ్జా అంటూ తన తండ్రి, కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఐశ్వర్య తండ్రి కృష్ణ రాజ్ క్యాన్సర్ తో సుధీర్ఘ కాలం పోరాటం చేసి 2017లో మరణించారు. తన తండ్రితో అత్యంత సన్నిహితంగా ఉండే ఐశ్వర్య... తన తండ్రి పుట్టినరోజు, చనిపోయిన రోజున ఆయన ఫొటోలను షేర్ చేయడం మాత్రం మరచిపోరు. 

ఐశ్వర్య చేసిన పోస్ట్ నేపథ్యంలో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తు్న్నారు. ప్రపంచానికి ఐశ్వర్యని అందించినందుకు మిస్టర్ రాయ్‌కి కృతజ్ఞతలు తెలుపుదామని కొందరంటే... చాలా మంది అమ్మాయిలకు తమ తండ్రులే అత్యంత ప్రేమించే వ్యక్తిగా ఉంటారని మరికొందరు కామెంట్ చేశారు. ఇక ఐశ్వర్య రాయ్ సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ మణిరత్వం రూపొందించిన యాక్షన్, డ్రామా ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ - 1లో ఐశ్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తదుపరి చిత్రం జైలర్ కాగా.. ఈ సినిమాలో సౌత్ సూపర్ స్టార్ నటుడు రజనీకాంత్, రమ్య కృష్ణన్, ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్‌లు కూడా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను మాత్రం అధికారికంగా వెలువరించలేదు.