Cannes 2026 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్ మెరుపులు.. కూతురు ఆరాధ్యతో కలిసి గ్రాండ్ ఎంట్రీ!

Cannes 2026 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్ మెరుపులు.. కూతురు ఆరాధ్యతో కలిసి గ్రాండ్ ఎంట్రీ!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికపైకి గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చారు.  రెడ్ కార్పెట్‌ను తనదైన స్టైల్‌లో షేక్ చేసేశారు. కొద్దిరోజులుగా ఈసారి ఐష్ వస్తుందా లేదా? అంటూ సాగిన ఉత్కంఠకు తెరదించుతూ, ఫెస్టివల్ ముగింపు దశలో  ఎంట్రీ ఇచ్చారామె.

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ‘లోరియల్’ (L’Oreal) గ్లోబల్ అంబాసిడర్‌గా 2003 నుండి కేన్స్‌లో మెరుస్తున్న ఐశ్వర్య.. ఈసారి అంతర్జాతీయ వేదికపై అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన ‘లుమినారా’ (Luminara) అనే స్కల్ప్చరల్ బ్లూ గౌన్‌లో అప్సరసలా మెరిసిపోయారు. దాదాపు 1500 గంటల పాటు చేత్తో శ్రమించి, వేల సంఖ్యలో క్రిస్టల్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో శరీరంపై కాంతి కిరణాలు ప్రవహిస్తున్నట్లు ఈ డ్రెస్‌ను క్రేజీగా డిజైన్ చేశారు. ఫ్రెంచ్ రివేరా వేదికపై ముదురు నీలి రంగు (Abyss blue) గౌన్‌లో ఆమె నమస్తే అంటూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులివ్వడం హైలైట్‌గా నిలిచింది. హాలీవుడ్ స్టార్ ఇవా లాంగోరియాతో కలిసి ఆమె ‘ది బర్త్‌డే పార్టీ’ స్క్రీనింగ్‌లో సందడి చేశారు.

 

అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఐష్ అక్కడితో ఆగలేదు. ఈవెనింగ్ జరిగిన ‘లైట్స్ ఆన్ విమెన్స్ వర్త్’ ఈవెంట్ కోసం ‘సోఫీ కోట్యూర్’ రూపొందించిన ఫ్లోరల్ డిజైన్, షీర్ కేప్ ఉన్న పాస్టెల్ పింక్ గౌన్‌లోకి మారిపోయి మరో షాక్ ఇచ్చారు. ఈ వేడుకలో ఐశ్వర్యతో పాటు తన 14 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శాటిన్ రెడ్ గౌన్, మెరిసే కేప్‌తో ఆరాధ్య ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్‌పై మహారాణిలా వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

 

ముందుగా లోరియల్ ప్రోమోలో ఆలియా భట్, హెలెన్ మిర్రెన్ కనిపించి ఐశ్వర్య కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కంగారుపడ్డారు. కానీ ‘కేన్స్ ఏదైనా.. ఆమె ఎప్పటికీ మిస్ అవ్వదు’ అంటూ బ్రాండ్ ఇచ్చిన మాటను ఐష్ నిజం చేసింది. ఎయిర్‌పోర్ట్ లుక్ నుండి రెడ్ కార్పెట్ దాకా ఐశ్వర్య క్రియేట్ చేసిన ఈ రేంజ్ హైప్ చూశాక.. ఇక ముగింపు వేడుకల్లో ఆమె ఇంకెంత క్రేజీగా కనిపిస్తుందోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.