న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్.. చీఫ్ సెలెక్టర్ రేస్‌లో అందరి కంటే ముందున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ పదవికి గురువారం రాజీనామా చేసిన అగార్కర్.. తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాడు. చీఫ్ సెలెక్టర్ జీతం కూడా భారీగా పెంచాలని బీసీసీఐ భావిస్తున్న తరుణంలో దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి కూడా రేస్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే వీళ్లు ఆ పోస్ట్‌కు అప్లై చేశారా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్‌కు ఏడాదికి కోటి రూపాయలు, సెలెక్టర్లకు రూ. 90 లక్షలు ఇస్తున్నారు.
అయితే కోచ్ కమ్ కామెంటేటర్‌గా పని చేస్తున్న అగార్కర్ ఏడాదికి కోటి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. 2021లో అగార్కర్ సెలెక్టర్ పోస్ట్‌కు అప్లై చేశాడు. ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాడు. కానీ ఏడాది మాత్రమే చాన్స్ ఉండటంతో అప్పట్లో ఆ పోస్ట్ తీసుకోలేదు. 45 ఏళ్ల అగార్కర్ కెరీర్ మొత్తంలో 26 టెస్ట్‌లు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు.