సర్కారు నౌకరి మూవీ మా కెరీర్‌‌‌‌కు ఫస్ట్ స్టెప్ లాంటిదన్న ఆకాష్

సర్కారు నౌకరి మూవీ మా కెరీర్‌‌‌‌కు ఫస్ట్ స్టెప్ లాంటిదన్న ఆకాష్

సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఆర్కే టెలీ షో బ్యానర్‌‌‌‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం‘సర్కారు నౌకరి’. భావన హీరోయిన్. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించాడు. జనవరి 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌మీట్‌‌లో హీరో ఆకాష్ మాట్లాడుతూ ‘ఈ మూవీ మా కెరీర్‌‌‌‌కు ఫస్ట్ స్టెప్ లాంటిది. 

కొత్త ఏడాదిలో మొదటి రోజు మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగులోనే ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపిస్తా. సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నాడు.  

మనసును తాకే ఎమోషన్, ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ కథలో ఉన్నాయని చెప్పింది భావన.  దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ ‘కంటెంట్ ఓరియెంటెడ్‌‌గా సాగే సినిమా ఇది. 90స్ బ్యాక్‌‌డ్రాప్‌‌లోని రియల్ ఇన్సిడెంట్స్‌‌తో దీన్ని రూపొందించాను’ అని అన్నాడు.