అయ్య గారి సినిమా అప్పుడే OTTలోకి.. అఖిల్ లెనిన్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

అయ్య గారి సినిమా అప్పుడే OTTలోకి.. అఖిల్ లెనిన్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

జులై 10న థియేటర్లలో విడుదలై హిట్ కొట్టిన అక్కినేని అఖిల్ సినిమా ‘లెనిన్’ ఓటీటీ తేదీ ఖరారైంది. ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న Z5 స్ట్రీమింగ్ తేదీ ప్రకటించింది. ఆగస్ట్ 7 నుంచి ‘లెనిన్’ సినిమా Z5లో స్ట్రీమ్ అవుతుందని తెలుగు దిన పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్న అఖిల్ లెనిన్ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ఇప్పటికే ప్రొడ్యూసర్స్ ప్రకటించారు. అయితే.. జులై 10న విడుదలైన ఈ సినిమా నెల రోజులు కూడా కాక ముందే OTTలో స్ట్రీమ్ అవుతుందని ప్రకటన రావడంపై అక్కినేని అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు.

ఈరోజుల్లో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే.. మొదటి పది రోజుల కలెక్షన్లే ప్రతీ సినిమాకు కీలకంగా మారాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే శుక్ర, శని, ఆది వారం.. ఈ మూడు రోజుల్లో ఎంత వస్తే సినిమా అంత సేఫ్గా బయటపడే పరిస్థితులున్నాయి.

ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ కూడా షరతులు విధించాకే సినిమా హక్కులను కోట్లకు కోట్లు పోసి కొంటున్నాయి. నెల రోజుల్లోపే స్ట్రీమ్ అవుతుండటంతో థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల్లో కొందరు ఓటీటీలో చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. ‘లెనిన్’ సినిమా హిట్తో అక్కినేని అఖిల్కు ఫ్లాపుల నుంచి భారీ ఊరట దక్కింది. భారీ బడ్జెట్ సినిమాలన్నీ బోల్తా కొట్టినా రూరల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ‘లెనిన్’ సినిమా అఖిల్ రాతను మార్చేసింది.

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. జులై 10, 2026న ఈ సినిమా విడుదలైంది. శ్రీరామపురం అనే ఊరి కథను నందు తెరకెక్కిన తీరు ప్రేక్షకులను మెప్పించింది.