అఖిల్కు సపోర్ట్గా ప్రశాంత్ నీల్.. రంగంలోకి సాహో, సలార్ మేకర్స్

అఖిల్కు సపోర్ట్గా ప్రశాంత్ నీల్.. రంగంలోకి సాహో, సలార్ మేకర్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాడ్ టైం అంటే అఖిల్(Akhil) దే అని చెప్పాలి. ఆయన మొదటి సినిమా అఖిల్(Akhil) నుండి మొన్నొచ్చిన ఏజెంట్(Agent) వరకు ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. మధ్యలో వచ్చిన బ్యాచులర్ సినిమా ఒకటి యావరేజ్ హిట్ గా నిలిచింది. నిజానికి ఏజెంట్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు అఖిల్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కూడా. అది కేవలం దర్శకుడు సురేందర్ రెడ్డి పైన ఉన్న నమ్మకమే. కానీ, ఆ సినిమా కూడా అఖిల్ కు హిట్టు ఇవ్వలేకపోయింది. అంతే కాదు.. ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి.. అఖిల్ ఫేమ్ ను మరింత కిందకు నెట్టేసింది. దీంతో కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అఖిల్. 

ఏజెంట్ సినిమా రిలీజై దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా కొత్త సినిమాను మొదలుపెట్టలేదు అఖిల్. అయితే.. ఆమధ్య కొత్త సినిమాపై వార్తలు వినిపించినా వాటిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక తాజాగా అఖిల్ కొత్త ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సాహో, రాధే శ్యామ్ సినిమాలకు పనిచేసిన కొత్త దర్శకుడు అనిల్ కుమార్ చెప్పున కథ బాగా నచిందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, హోంబలె ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని సమాచారం.

ఇక ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్టుకు సంబందించిన చాలా విషయాలు ఆయనే దగ్గరుండి చూసుకోనున్నాడట. ఇందుకోసం తన సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వనున్నాడట ప్రశాంత్. ఈసారి ఎలాగైనా అఖిల్ కు హిట్టు ఇవ్వాలని టీమ్ ఫిక్స్ అయ్యారట. ఇవన్నీ చూస్తుంటే.. ఈ సినిమాతో అయినా ఖచ్చితంగా హిట్టు కొట్టాలని అఖిల్ ఫిక్స్ అయ్యాడని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.