అయ్యగారి సినిమాకు మోక్షం.. OTTకి వచ్చేస్తున్న అఖిల్ ఏజెంట్

అయ్యగారి సినిమాకు మోక్షం.. OTTకి వచ్చేస్తున్న అఖిల్ ఏజెంట్

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా వచ్చిన ఏజెంట్(Agent) మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టైలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి(Surendar reddy) తెరకెక్కించిన ఈ మూవీ ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దాంతో మరో ప్లాప్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. నిజానికి ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాడీ బిల్డింగ్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. కానీ, ఫైనల్ గా రిజల్ట్ మాత్రం మారలేదు.

ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏజెంట్ సినిమా రిలీజై 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికే ఓటీటీకి రాలేదు ఈ మూవీ. మేకర్స్ కూడా ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అక్కినేని అభిమానులు కూడా చాలా కాలంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చూశారు కానీ, ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఈ సినిమా ఓటీటీకి రాదు అను డిసైడ్ అవుతున్న సమయంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ మూవీకి ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.