వైల్డ్ ఏజెంట్‌‌‌‌‌‌‌‌

వైల్డ్ ఏజెంట్‌‌‌‌‌‌‌‌

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ర్’ లాంటి లవ్ స్టోరీ తర్వాత ‘ఏజెంట్’ అనే యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాబోతున్నాడు అఖిల్‌‌‌‌‌‌‌‌. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. కండలు తిరిగిన బాడీతో ‘రా ఏజెంట్‌‌‌‌‌‌‌‌’గా కనిపించబోతున్నాడు. నిన్న అఖిల్ పుట్టినరోజు కావడంతో కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సిగరెట్ తాగుతూ బీస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు అఖిల్. ‘వైల్డ్ హంట్ కోసం రెడీగా ఉన్నాడు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ బర్త్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ఈసారి బర్త్ డేకి టీజర్ వస్తుందని ఆశించారు అభిమానులు. అయితే అది వీలు కావట్లేదంటూ అభిమానులకు సారీ చెప్పారు నిర్మాత అనిల్ సుంకర. ‘టీజర్ అందించలేకపోయినందుకు సారీ. ఫ్యాన్స్ కోరుకున్న దానికంటే బెస్ట్ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇవ్వాలనుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు తగ్గ స్థాయిలో, మే నెలలో హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌ క్వాలిటీతో టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారాయన. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఆగస్టు 12న సినిమా విడుదల కానుంది.