అఖిల్ రాజ్, నాగదుర్గ శనార్తి చిత్రం ప్రారంభం

 అఖిల్ రాజ్, నాగదుర్గ శనార్తి చిత్రం ప్రారంభం

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అఖిల్ రాజ్, నాగదుర్గ జంటగా రూపొందుతున్న చిత్రం ‘శనార్తి’. సంపత్ నంది టీమ్‌‌‌‌వర్క్స్‌‌‌‌, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంపత్ నంది శిష్యుడు రాజ్ గణేష్ ఉప్పునూతి దర్శకుడు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. శుక్రవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 

 సంపత్ నంది మాట్లాడుతూ ‘గ్రామాల్లో ఆత్మీయంగా పలకరించుకునే పదం ‘శనార్తి’. ఈ ప్రేమకథా చిత్రానికి ఈ టైటిల్‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌ యాప్ట్‌‌‌‌. అఖిల్‌‌‌‌, నాగదుర్గ కాంబినేషన్ స్క్రీన్‌‌‌‌పై చాలా అందంగా ఉంటుంది’ అని చెప్పారు. చాలా మంచి సినిమా అవుతుందని అఖిల్ రాజ్, నాగదుర్గ చెప్పారు. ఈ  జంటతో ఓ మ్యాజిక్ చేయబోతున్నాం అని దర్శకుడు చెప్పాడు.  అద్భుతమైన కథతో ఈ సినిమా వస్తోందని నిర్మాత శ్రీధర్ వెల్లడించారు.