మహాకాళిలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా.. గెటప్ మాత్రం మాములుగా లేదు..!

మహాకాళిలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా.. గెటప్ మాత్రం మాములుగా లేదు..!

విలక్షణమైన నటనతో బాలీవుడ్‌‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అక్షయ్ ఖన్నా. గతంలో ఆయన  హీరోగా నటించిన  సినిమాల కంటే.. సెకండ్ ఇన్నింగ్స్‌‌లో పోషించిన ‘ఛావా’లోని ఔరంగజేబు పాత్ర, ధురంధర్’లోని రెహమాన్ డెకాయిట్‌‌ పాత్ర తన కెరీర్‌‌‌‌లో టర్నింగ్ పాయింట్స్‌‌గా నిలిచాయి. ప్రస్తుతం ‘మహాకాళి’ చిత్రంలో శుక్రాచార్యుడిగా కీలకపాత్ర పోషిస్తున్నారు అక్షయ్ ఖన్నా.  ‘హనుమాన్‌‌’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షో రన్నర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. 

భూమి శెట్టి టైటిల్ రోల్ చేస్తోంది. ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. శనివారం అక్షయ్ ఖన్నా  పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ సెట్స్‌‌ నుంచి కొత్త స్టిల్‌‌ను విడుదల చేశారు. ఇందులో శుక్రాచార్యుడి గెటప్‌‌లో ఉన్నారు అక్షయ్ ఖన్నా. ఇప్పటికే ఆయన తన పార్ట్‌‌ షూట్‌‌ను పూర్తి చేశారు. మొత్తం వంద రోజుల షూటింగ్‌‌ పూర్తయింది.  చివరి 40 రోజుల షెడ్యూల్‌‌ను హైదరాబాద్‌‌లో ప్రారంభించారు. మరోవైపు వీఎఫ్ఎక్స్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్‌‌ డేట్‌‌ను 
రివీల్ చేస్తామని మేకర్స్‌‌ తెలియజేశారు.