అయలాన్ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రేక్షకులకు ఇదొక కొత్త అనుభూతి

అయలాన్ తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రేక్షకులకు ఇదొక కొత్త అనుభూతి

శివ కార్తికేయన్(Shiva karthikeyan), రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preetsingh) జంటగా తెరకెక్కిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ అయలాన్(Ayalaan).ఆర్. రవికుమార్(R Ravikumar) దర్శకుడు. కోటపాడి జె. రాజేష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న తమిళనాట విడుదలైంది. తెలుగులో ఈ నెల 26న విడుదల కాబోతోంది. గతంలో శివకార్తికేయన్‌‌‌‌ సినిమా ‘వరుణ్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌’ను విడుదల చేసిన గంగ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ మాట్లాడుతూ ‘క్వాలిటీ విషయంలో రాజీపడకుండా హాలీవుడ్ స్టాండర్డ్స్‌‌‌‌లో తెరకెక్కించాం. వీఎఫ్‌‌‌‌ఎక్స్ వర్క్ పూర్తవడానికి రెండేళ్లు పట్టింది. తమిళంలో హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది.  ఏఆర్ రెహమాన్ గారి పాటలు, నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని చెప్పారు. ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర పాత్రలు పోషించారు.