
కాగజ్ నగర్ వెలుగు : కౌటాల మండలం కన్నెపల్లిలో మద్యాన్ని నిషేధించారు. శనివారం సాయంత్రం గ్రామస్తులంతా సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల గ్రామంలో గొడవలు జరగడం, కుటుంబాల్లో కలహాలు పెరిగిపోయాయని, ఇందుకు మద్యమే కారణమని గుర్తించారు.
దీంతో గ్రామంలో మద్యం అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.