రైలు కింద తల పెట్టిన వ్యక్తి... కాపాడిన మహిళా పోలీస్...

రైలు కింద తల పెట్టిన వ్యక్తి... కాపాడిన మహిళా పోలీస్...

ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ ఓ వేగంగా వస్తున్న లోకల్ రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని మహిళా పోలీస్ కాపాడింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. గురువారం ( జులై 30 ) రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

రాత్రి సుమారు 10:54 గంటలకు ఒక లోకల్ రైలు స్టేషన్ నుండి బయలుదేరుతుండగా ప్లాట్‌ఫాం మీద ఈ సంఘటన జరిగింది. ఇది వెంటనే గమనించిన పోలీస్ కానిస్టేబుల్ నర్వాడే పరుగెత్తుకెళ్లి, అతని కాళ్లను పట్టుకుని, క్షణాల్లో పట్టాల నుండి పక్కకు లాగారు. ఆ వ్యక్తి పెద్దగా గాయాలేమీ లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో కామెంట్స్ సెక్షన్స్ లో మహిళా పోలీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. మహిళా పోలీస్ సమయస్ఫూర్తి అద్భుతమని... ఆమె అసలు హీరో అని.. అలాంటివారి గురించి ప్రజలకు తెలిసేలా షేర్ చేయాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.