‘నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకావిష్కరణ

‘నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, వెలుగు: రమణారెడ్డి గొప్ప కమెడియన్ అని సినీ నటుడు అలీ కొనియాడారు. సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ రాసిన ‘ నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకాన్ని అలీ బుధవారం సాయంత్రం తన ఇంట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రమణారెడ్డి లెజెండ్రీ కమెడియన్ అని.. ఆయన ఏ పాత్ర చేసినా నెల్లూరు యాసను వదల్లేదన్నారు. అప్పట్లో ఆయన తెరమీద కనిపిస్తేనే జనం చప్పట్లు కొట్టేవారన్నారు. 

రమణా రెడ్డి, రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు వీళ్లందరిదీ స్వర్ణ యుగమన్నారు. మాయాబజార్, గుండమ్మ కథలో రమణా రెడ్డి కామెడీ టైమింగ్ చాలా గొప్పగా ఉంటుందన్నారు. ఆ సినిమాలు చూస్తూ తాను పెరిగానని అలీ తెలిపారు. పుస్తకాన్ని ప్రచురిస్తున్న పబ్లిషర్ జిలాన్ బాషాకు అలీ అభినందనలు తెలిపారు.