అలియా భట్, శర్వరి వాఘ్ లీడ్ రోల్స్‌లో వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఫస్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. శివ్ రావైల్ దర్శకుడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సీత అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో అలియా నటించింది. తండ్రి (బాబి డియోల్) ఆమెకు చిన్నతనం నుంచే కఠిన శిక్షణ ఇచ్చి ఓ కిరాయి హంతకురాలిగా పెంచుతాడు. ఇండియాకు వ్యతిరేకంగా ఆల్ఫా పేరుతో ఓ సీక్రెట్ మిషన్ నడుపుతుంటాడు బాబిడియోల్. అందుకోసమే అలియాను రెడీ చేస్తాడు. కానీ అతనికి శత్రువుగా మారిన ఆమె.. ఆ మిషన్‌ను ఎలా అడ్డుకుంది, అందుకు స్పై ఏజెంట్ అయిన శర్వరి వాఘ్ ఎలా హెల్ప్ అయింది అన్నది మెయిన్ కాన్సెప్ట్.
‘‘సీత లంకాదహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా..” అని అలియా చెప్పిన డైలాగ్‌తో మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో రివీల్ చేశారు. అలియా, శర్వరి కలిసి చేసిన యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సన్నివేశాలు ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక ట్రైలర్ చివర్లో హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించడం మరింత ఆసక్తి పెంచింది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 3న విడుదల కానుంది.
