బ్రెజిల్ vs స్కాట్లాండ్ మ్యాచ్కి ఏలియన్స్ వస్తారట.. వరల్డ్ కప్‌లో వైరల్ ఫ్యాంటసీ.. సోషల్ మీడియా షేక్!

బ్రెజిల్ vs స్కాట్లాండ్ మ్యాచ్కి ఏలియన్స్ వస్తారట.. వరల్డ్ కప్‌లో వైరల్ ఫ్యాంటసీ.. సోషల్ మీడియా షేక్!

Brazil vs Scotland Match: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా మియామి వేదికగా జరగబోయే బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్‌ గురించి ఒక వింతైన చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 24.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు వో బహియానా (Vo Bahiana) చేసిన ఒక జోస్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మ్యాచ్ జరిగే మియామి స్టేడియంపై ఏలియన్లు (గ్రహాంతరవాసులు) దాడి చేయబోతున్నాయంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

కల‌లో కనిపించిన మదర్‌షిప్: 
వో బహియానా సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టుకుంటూ షేర్ చేసిన వీడియోలో.. ఆమెకు భయంకరమైన కల రెండుసార్లు వచ్చిందట.. నా కలలో మియామి స్టేడియం పైన అనేక అంతరిక్ష నౌకలు (UFOs) కనిపించాయి. మొదట వచ్చిన ఒక స్పేస్ షిప్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లను కిడ్నాప్ చేసింది.. ఆ తర్వాత ఒక భారీ మదర్‌షిప్ స్టేడియం పైకి వచ్చి, యాంత్రిక చేతుల (Mechanical hands) సహాయంతో గ్యాలరీల్లో ఉన్న వేలాది మంది అభిమానులను ఎత్తుకెళ్లిపోయింది. మరో నౌకలో భయంకరమైన బల్లి రూపంలో ఉండే గ్రహాంతరవాసులను కూడా చూశా.. స్టేడియం అంతా అరుపులు, ఏడుపులతో నరకంలా మారిందని చెప్పుకొచ్చింది. 

లాస్ట్ మినిట్‌లో జ్యోతిష్యురాలు ట్విస్ట్:
మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు లైవ్ స్ట్రీమ్‌లోకి వచ్చిన బహియానా తన జోస్యానికి కట్టుబడే ఉన్నానని చెబుతూనే, రూట్ కాస్త మార్చారు. నా కలలు చాలా వరకు నిజమవుతాయి.. ఈరోజు ఏదో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగొచ్చు.. కానీ నేను కలలో చూసినట్లే ప్రతిదీ జరగాలని రూల్ లేదు.. బహుశా స్పేస్ షిప్ రావచ్చు కానీ ఆటగాళ్లను తీసుకెళ్లకపోవచ్చు అంటూ సేఫ్ గేమ్ ఆడింది. అంతేకాదు, తనను ట్రోల్ చేసేవారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చింది. 

►ALSO READ | భారత్ సెమీఫైనల్ ఆశలు ఇంకా సజీవం.. కానీ బంగ్లాతో మ్యాచ్ తప్పక గెలవాలి!

రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్ట్: 
ఈ వార్త వైరల్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు స్టేడియం పైన ఏలియన్ షిప్స్ ఉన్నట్లు ఏఐ (AI) తో క్రియేట్ చేసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. దీనికి తోడు మియామి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒక క్రేజీ ఏఐ ఫోటోను షేర్ చేస్తూ ఫన్నీ పోస్ట్ పెట్టింది. ఈ రాత్రి స్కాట్లాండ్ వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్ కోసం ఎఫ్‌ఏఏ (FAA) విమాన ఆంక్షలు విధించింది.. ఎందుకంటే అక్కడ కొన్ని వింత ఆకాశ వింతలు (UFOs) కనిపిస్తున్నాయంటూ పేర్కొంది. కాగా గతంలో రియో గ్రాండే డో సుల్ వరదలు, కొందరు బ్రెజిలియన్ సంగీతకారుల మరణాల గురించి ఆమె చెప్పిన జోస్యాలు నిజమవడంతో.. ఈసారి కొందరు ఫ్యాన్స్ దీనిని సీరియస్‌గా తీసుకుని తెగ భయపడిపోతున్నారు.