టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై కాల్పుల కేసులో ముగ్గురు దుండగుల అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై కాల్పుల కేసులో ముగ్గురు దుండగుల అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...
  • రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్టుకున్న పోలీసులు
  • లారెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఠాతో సంబంధాలున్నట్టు గుర్తింపు
  • టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిప్యూటీ సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిండే పరామర్శ 

ముంబై: బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటుడు టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాల్పులకు పాల్పడిన నిందితులు ముగ్గురిని రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా లారెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఠాతో సంబంధాలు ఉన్నవారేనని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంబై జుహూ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యంగా దుండగులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. 

ఈ దాడిలో నటుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఘటన అనంతరం బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పారిపోయిన నిందితులు.. అంధేరీ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ద్విచక్రవాహనాన్ని వదిలేసి లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కారు. అనంతరం గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా పుణె–-జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రయాణిస్తున్నట్టు ముంబై పోలీసులు గుర్తించి.. రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు సమాచారం అందించారు. 
దీంతో రంగంలోకి దిగిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాంటీ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోటా నగర పోలీసులు సంయుక్తంగా రైలును చుట్టుముట్టి ముగ్గురినీ పట్టుకున్నారు.

ముందస్తు రెక్కీతోనే దాడి

పట్టుబడిన వారిలో హర్యానా సోనిపట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రెహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (18), బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెగూసరాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హృతిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (22)తో పాటు మరో 17 ఏళ్ల మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. హృతిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంబై అంధేరీలో ఉంటూ ర్యాపిడో రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. రెహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గతంలోనూ అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష అనుభవించాడు. నిందితులు టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దినచర్యపై ముందుగానే రెక్కీ నిర్వహించారు. ప్రతి ఆదివారం ఆయన జుహూ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైదానానికి వస్తారని తెలుసుకొని, గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి కారులో బయలుదేరే సమయాన్ని ఎంచుకొని దాడికి తెగబడ్డారు.

గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్లను సహించం..

ముంబైలో నేర ముఠాల ఆగడాలను ఏమాత్రం ఉపేక్షించబోమని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిండే బాంద్రాలోని టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు. 1990ల నాటి తరహాలోనే గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ల మూలాలను మళ్లీ పెకిలించి వేస్తామని, బుల్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుల్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.