Alcohol: ఇంట్రస్టింగ్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్..

Alcohol: ఇంట్రస్టింగ్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్..

అల్లరి నరేష్... కామెడీ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్న హీరో. అయితే.. కొంతకాలం పాటు వరుస ప్లాప్స్ తో సతమతమైన అల్లరి నరేష్, తన పంధా మార్చుకొని సీరియస్ రోల్స్ చేస్తూ ఉగ్రం, నాంది వంటి హిట్స్ అందుకోవడమే కాకుండా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్రమంలో అల్లరి నరేష్ అప్ కమింగ్ సినిమాకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా సోమవారం ( జూన్ 30 ) సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఆల్కహాల్ టైటిల్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మెహర్ తేజ్ దర్శకత్వం వశిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తి పెంచుతున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. డైరెక్టర్ మెహర్ తేజ్ గత చిత్రం ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి హిట్ ట్రాక్ ఉన్న బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలవాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.