ఎమోషన్ ఉన్న ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌ ఆ ఒక్కటీ అడక్కు

ఎమోషన్ ఉన్న ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌ ఆ ఒక్కటీ అడక్కు

అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా  అబ్దుల్లా హీరోయిన్. మే 3న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మల్లి మాట్లాడుతూ ‘పెళ్లి చుట్టూ ఉండే ఎమోషన్స్.. కొందరు ఆ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలా క్యాష్ చేసుకుంటున్నారు లాంటి అంశాలతో దీన్ని తెరకెక్కించాం. హీరోని పెళ్లి గురించి అందరూ అడుగుతున్నప్పుడు ఆయన సమాధానంగా చెప్పే మాట ‘ఆ ఒక్కటీ అడక్కు’. నరేష్‌‌‌‌‌‌‌‌ గారే ఈ టైటిల్ సూచించారు. నిజానికి పెళ్లి గురించి అందరూ చాలా తేలిగ్గా అడిగేస్తారు.. కానీ ఆ వ్యక్తితో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్‌‌‌‌‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా చూపించే ప్రయత్నం చేశాం. సందేశంలా ఉండదు కానీ  పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపించే ప్రయత్నం చేశాం. నరేష్ గారి క్యారక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయి.  ఫరియా పాత్ర కీలకం. తన ద్వారానే కథ మలుపు తిరుగుతుంది. జానీ లీవర్ గారి కూతురు జామీ లీవర్ నరేష్‌‌‌‌‌‌‌‌ గారి తమ్ముడి భార్యగా హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా నవ్విస్తారు. అలాగే హర్ష, వెన్నెల కిషోర్ పాత్రలు నవ్విస్తాయి.  డైలాగ్ రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అబ్బూరి రవి గారు సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు.  అలాగే గోపీ సుందర్ గారి సంగీతం ఇంప్రెస్ చేస్తుంది’ అని అన్నాడు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌